హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

PPM: పాలకొండలో సంకిలి వద్ద నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో బావి నుంచి నీటిని తోడే మోటార్లలో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా ఇవాళ నగర పంచాయతీ పరిధిలోని ఆఫీస్‌ ట్యాంకు పరిధి ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుందని కమీషనర్ నూకరాజు తెలిపారు. ప్రజల అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నామని, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.