హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి 9వ డివిజన్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఇవాళ ఉదయం 9వ డివిజన్‌లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పీహెచ్ కార్మికులతో మాట్లాడి, డివిజన్‌లో పారిశుధ్యం, పరిశుభ్రత, పరిసరాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. పారిశుధ్య పనులను సమర్థవంతంగా చేపట్టాలని పీహెచ్ కార్మికులు, నగర దీపికలకు సూచనలు జారీ చేశారు. వీధుల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు.