E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాల్లోని షాపుల లీజుదారులు అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. లేకుంటే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం నగరపాలక అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. దానవాయిపేటలోని మున్సిపల్ కాంప్లెక్స్‌ను సందర్శించి షాపుల వివరాలు, ఆదాయ వనరులు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలి: కమిషనర్


