హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కావలి రాజకీయాల్లో సంచలనం

NLR: కావలి మాజీ ఏఎంసి ఛైర్మన్, మాజీ వైసీపీ నేత మన్నేమాల సుకుమార్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది కావలి రాజకీయాల్లో సంచలనంగా మారింది.