హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ పర్యటన

VZMఫ జిల్లాలో ఇవాళ రెవెన్యూ, పరిశ్రమలు-వాణిజ్యం శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా పర్యటించనున్నారు. ఉదయం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం జిల్లా అధికారులతో ఎక్సైజ్‌,గనుల శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం విశాఖ వెళ్లి అక్కడి అధికారులతో ఎక్సైజ్‌ శాఖపై సమీక్షలో పాల్గొంటారు. రేపు ఉదయం భోగాపురం చేరుకుని విజయవాడ వెళ్తారు.