హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

VSP: కోరమాండల్ సీఎస్ఆర్ నిధులతో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నట్లు సెమ్స్ సీఈవో గోపీకృష్ణ తెలిపారు. 18-27 ఏళ్ల ఐటీఐ, డిప్లొమా అర్హులకు 2 నెలలు ఎలక్ట్రికల్, బీటెక్ మెకానికల్ వారికి 4 నెలలు ప్రొడక్ట్ డిజైన్ కోర్సులో శిక్షణ ఇస్తారన్నారు. అర్హులు అక్టోబరు 4లోగా సింధియా వద్ద సెమ్స్ కార్యాలయంలో సంప్రదించాలి. వివరాలకు 98481 83865.