హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: ఇటీవల తుఫాన్‌ ప్రభావంతో వీచిన భారీ ఈదురు గాలులకు విద్యుత్‌ లైన్లపై పడిన కొమ్మలను తొలగించే కారణంగా బొబ్బిలి మండలం నారసింహునిపేట సబ్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు శనివారం ఉదయం 9 నుంచి మద్యాహ్నం 2 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి. రఘు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.