హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరపాలక సంస్థలో ప్రత్యేకాధికారి పాలన పొడిగింపు

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో ప్రత్యేకాధికారి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రత్యేకాధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పదవీకాలం వచ్చే నెల 11తో ముగియనుండగా, ఆరు నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు ఆయనే కొనసాగనున్నారు. నగరపాలక పాలకవర్గం గడువు ముగియడంతో కలెక్టరే ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.