హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో 29 పోలింగ్ కేంద్రాలు: కమిషనర్

SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు–2026కు 28 వార్డులకు 29 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ప్రజల పరిశీలన కోసం ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను ఉంచారు. అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 26న సా.5 గంటల్లోగా మున్సిపల్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందించాలని కమిషనర్ శ్రీనివాసులు కోరారు.