ATP: ట్రాన్స్‌మిషన్ టవర్‌ల పరిహారం సమస్యపై గుంతకల్లు ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులతో సమీక్షించారు. వజ్రకరూరు - దోనముక్కల 220 కేవీ లైన్ పనుల్లో పెండింగ్‌లో ఉన్న 12 టవర్ల స్థలాలకు రైతులు అదనపు పరిహారం కోరుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా పరిహారాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిహారం సమస్యపై కలెక్టర్ సమీక్ష


