హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం గ్రామస్థుల నిరసన

ATP: శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పది రోజులుగా నీరు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శిని కోరగా స్పందన లేకపోవడంతో గ్రామ సచివాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను గ్రామస్థులు కోరారు.