హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ మార్కెట్లో పెసర్లకు రికార్డు ధర..!

WGL : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు కొత్త పెసర్లు వచ్చాయి. శుక్రవారం యార్డులో జరిగిన కొనుగోళ్లలో పెసర్లకు ఊహించని ధర లభించింది. గతంలో క్వింటాకు రూ.7వేలు ఉన్న ధర ఒక్కసారిగా క్వింటాకు గరిష్టంగా రూ.9,100 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త పంటకు తొలి రోజే మంచి ధర రావడంతో పెసర్లు సాగు చేసిన రైతుల్లో ఆనందం నెలకొంది.