పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. అర్హులు తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారులకు అందజేసి ఈ ప్రత్యేక వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు కలెక్టరేట్‌లో ప్రత్యేక ఫిర్యాదుల వేదిక'


