హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికుడి నగదు చోరీ

CTR: పలమనేరులోని ఆర్టీసీ బస్టాండులో కుప్పం బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి జేబులోని రూ.30 వేలు చోరీకి గురయ్యాయి. బైరెడ్డిపల్లెకు చెందిన టమాటా వ్యాపారి అశోక్ పలమనేరుకు వచ్చాడు. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండుకు వచ్చి బస్సు ఎక్కుతుండగా నగదు చోరీకి గురైంది. బాధితుడు ఈ మేరకు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.