హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్ విజేతలకు సీఎం నజరానా

ఆసియా గేమ్స్-2026లో పతకాలు సాధించిన తమిళనాడు అథ్లెట్లకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ నజరానా ప్రకటించారు. 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలే రేసులో రజత పతకం సాధించిన జట్టులోని తమిళనాడుకు చెందిన విద్య రామరాజ్, విశాల్‌లకు చెరో రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్‌ను ఆయన అనౌన్స్ చేశారు. వీరి విజయం యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.