హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహన తనిఖీల్లో 30 బైక్‌లు స్వాధీనం

PLD: నకరికల్లు అడ్డరోడ్డు వద్ద SI కె. సతీష్ విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేకపోవడం, హెల్మెట్ ధరించకపోవడంతో 30 మందికి జరిమానా విధించారు. మద్యం సేవించి బైక్ నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు SI తెలిపారు. నిబంధనలు తప్పక పాటించాలని ఆయన సూచించారు.