హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ గర్జన సభను జయప్రదం చేయాలి'

E.G: రాజమహేంద్రవరంలో ఈ నెల 27న ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని మండపేట నియోజకవర్గ వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు పాలిక శ్రీను పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 'వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన' సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.