ASR: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయలో శుక్రవారం ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి బోడుగూడ హిల్స్ వరకు ఆరు కిలోమీటర్ల మేర సాగిన ఈ కార్యక్రమంలో మూడు అడ్వెంచర్ టీములకు చెందిన 23 మంది పాల్గొన్నారు. జిల్లా పర్యాటక అధికారి చలపతిరావు, ఎంపీడీవో వీసం ప్రసాద్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
బోడుగూడ హిల్స్‌కు ట్రెక్కింగ్


