KRNL: దేవనకొండ మండలం పి.కోటకొండ క్రాస్ నుంచి బేతపల్లి మీదుగా లక్కసాగరం రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. 30 ఏళ్లుగా రహదారి అధ్వానంగా ఉండటంతో గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రూ.4.7 కోట్ల నిధులు మంజూరయ్యాయని కూటమి నాయకులు తెలిపారు. రహదారి పనులు ప్రారంభం కావడంపై ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
ఆంధ్రప్రదేశ్
'30 ఏళ్ల కల నెరవేరింది'


