హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ప్రకాశం: దొనకొండ (M) కొచ్చర్లకోటలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సమాచారం అందడంతో SI రామకృష్ణ సిబ్బందితో దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,270గా పోలీసులు తెలిపారు. మద్యం సీసాలను దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసినట్లు వెల్లడించారు.