హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్: సింధు, లక్ష్యసేన్‌లకు కఠిన డ్రా

ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో స్టార్ షట్లర్లు సింధు, లక్ష్యసేన్‌లకు కఠిన డ్రా ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో సింధు సెమీస్ చేరాలంటే ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫైను ఓడించాల్సి రావచ్చు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్.. రెండో రౌండ్‌లో లో కీన్ యిని, క్వార్టర్స్‌లో నెం.1 జొనాథన్ క్రిస్టీని ఢీకొనే అవకాశం ఉంది. పతకాల కోసం వీరు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.