కడప: జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 25 నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని జెడ్పీ ప్రత్యేకాధికారిగా నియమించింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించగా, అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు జెడ్పీ పరిపాలనను కలెక్టర్ ప్రత్యేకాధికారిగా పర్యవేక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడప జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్


