హైదరాబాద్: 28°C
తెలంగాణ

గదిలో విగతజీవిగా యువకుడు

MDCL: నాగోల్‌లో జరిగిన స్వల్ప రోడ్డు ప్రమాదంలో పీర్జాదిగూడ శ్రీపురి కాలనీకి చెందిన అజయ్‌ (21) గాయపడ్డాడు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన తన గదిలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు తట్టినా స్పందన రాలేదు. దీంతో కిటికీ పగులగొట్టి చూడగా అజయ్‌ మృతిచెంది కనిపించాడు. ఘటనపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.