హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం వేళ.. ప్లకార్డులతో ఓ తండ్రి

HYD: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం కొనసాగుతున్న వేళ ఓ తండ్రి తన కుమారుడిని ఎత్తుకుని ప్లకార్డులతో నిలబడటం అందరి దృష్టిని ఆకర్షించింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్సకు రూ.26 కోట్లు అవసరమని, ఆర్థిక సాయం అందించాలని ప్రజలను కోరుతున్నట్లు తండ్రి తెలిపారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.