హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి కబడ్డీలో కౌడిపల్లి జోరు

MDK: పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీ ఘనంగా ముగిసింది. 42 జట్ల నుంచి 550 మంది పోటీపడగా.. 14, 17 ఏళ్ల రెండు విభాగాల్లోనూ కౌడిపల్లి జట్లు విజేతగా నిలిచాయి. ప్రతిభ చాటిన 24 మందిని మెదక్ జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. విజేతలకు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు బహుమతులు అందజేశారు.