హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో బీటెక్ విద్యార్థి మృతి

ATP: పామిడి పట్టణంలోని వాణి నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటి భవనానికి నీరు పడుతుండగా శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై బీటెక్ విద్యార్థి రాహుల్ గౌడ్ అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాహుల్ గౌడ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.