హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్వాడీలపై పని భారం తగ్గించాలి'

KRNL: పత్తికొండ(M)లో అంగన్వాడీలపై పని భారాన్ని మోపుతున్న8 ఫొటో అప్లోడ్ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని అంగన్‌వాడీ సిబ్బంది డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ఆఫీస్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ, కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ 8 ఫొటోల విధానం పని భారం పెంచుతోందన్నారు. సమస్య పరిష్కరించకపోతే 26న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.