హైదరాబాద్: 28°C
వార్తలు

జోనల్‌ కమిషనర్‌ దృష్టికి సమస్యలు

VSP: జీవీఎంసీ 37వ వార్డులో వర్షాల కారణంగా తలెత్తిన సమస్యలను టీడీపీ కో-క్లస్టర్‌ మున్నం బాలాజీ జోనల్‌ కమిషనర్‌ మల్లయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వార్డును సందర్శించి కాలువల పూడిక తొలగింపు, యూజీడీ మూతల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు.