హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతలమయంగా స్టేషన్ రోడ్డు

WGL: వరంగల్ స్టేషన్ రోడ్డుపై అడుగడుగున ఏర్పడిన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.