HNK: కాజీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవ్ ప్రాథమిక పాఠశాల.. సేవ్ టీచర్స్ అనే నినాదంతో నిరసన తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలని నినాదాలు చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'కాజీపేటలో ఉపాధ్యాయుల ఆందోళన'


