హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

NRPT: జిల్లా కేంద్రంలో IDOC భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం నూతనంగా నిర్మిస్తున్న ఈ భవనాన్ని ఆమె క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అధికారుల ఛాంబర్లు, మీటింగ్ హాల్‌ను పరిశీలించిన కలెక్టర్ ప్రొజెక్టర్, టీవీ ఏర్పాట్లతో పాటు భవనం వెలుపల హార్టికల్చర్ గ్రీనరీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.