హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఖరీఫ్ పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి'

నిర్మల్ ఖరీఫ్ పంటల కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేశ్ అధికారులను ఆదేశించారు. వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.