హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు పట్టాభిషేకం కార్యక్రమం

NTR: జిల్లాలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గతంలో మంజూరైన నివేశన స్థల పట్టాలకు అమ్మకపు హక్కుతో రిజిస్ట్రేషన్, ప్రభుత్వ భూముల్లో గృహ నిర్మాణం చేసుకున్న అర్హులైన ఆక్రమణదారుల క్రమబద్ధీకరణ దీని లక్ష్యం. అర్హులు తమ సమీప స్వర్ణ గ్రామం, వార్డు లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి.