హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన సిద్ధి వినాయక జాతర రథోత్సవం

SRD:​ పటాన్‌చెరు మండలం రుద్రారం శివారు సిద్ధి వినాయక ఆలయంలో శుక్రవారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో లావణ్య పర్యవేక్షణలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా నిర్వహించే ఆచార సాంప్రదాయాల ప్రకారం జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.