హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు ఆదాయానికి ఊతం

NDL: రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యాన, వ్యవసాయ రంగాల అభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. నంద్యాల జిల్లాలో 40 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతాల్లో ఉద్యాన, ఆయిల్‌పామ్ వంటి అధిక ఆదాయ పంటలను ప్రోత్సహిస్తామన్నారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.