హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయాలి: జక్కంపూడి

E.G: సీతానగరంలో మండల కమిటీల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు.