VZM: ఆర్నాబ్ తుఫాను సమయంలో ఉత్తరాంధ్రలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ, పశు నష్టం జరగకుండా తీసుకున్న చర్యలు అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో నష్టాన్ని నివారించగలిగామన్నారు. తుఫాను ప్రభావం తగ్గినా కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అధికారుల సేవలు భేష్: మంత్రి


