హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభయ QR కోడ్‌పై అవగాహన

AKP: రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు, క్యాబ్‌లపై స్టిక్కర్లు అతికించారు. వేధింపులు ఎదురైతే QR కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అత్యవసర సహాయం కోసం 112,సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930కు సంప్రదించాలని సూచించారు.