హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలు ధైర్యంగా నిలబడాలి'

NDL: మహానంది మండలం బుక్కాపురంలో మహిళలు, అంగన్వాడీ సిబ్బందితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరాలపై మౌనం వహించకుండా పోలీసులకు సమాచారం అందించాలని ఏఎస్పీ సుస్మిత సూచించారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.