హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే దేవ

కోనసీమ: మలికిపురం మండలం రామరాజులంక బాడవ పల్లిపాలెంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. స్థానిక మత్స్యకార కుటుంబాలను కలిసి రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 100 మత్స్యకార కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.