హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయ పునర్నిర్మాణానికి.. ఏర్పాటు

SRD: కోహిర్ మండలం బడంపేట్ గ్రామంలోని శ్రీ రచ్చన్న స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ (దేవాదాయ) శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. మూడేళ్ల కాలపరిమితితో 14 మంది సభ్యులతో కూడిన 'రెనోవేషన్ కమిటీ'ని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఈవో శివ రుద్రప్ప శుక్రవారం తెలిపారు.