హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

ప్రకాశం: ఒంగోలు మండలం పెల్లురు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఆటో ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగాక లారీ కంట్రోల్ తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కి గాయాలయ్యాయి.