ASF: సిర్పూర్ (టి)లోని పెద్దబండ ఎక్స్‌రోడ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు. హీరాపూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
తెలంగాణ
'అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత'


