హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏఐతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంపు'

PDPL: ఏఎక్స్‌ఎల్ ఏఐతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ఏఐ ద్వారా అభ్యసించేలా ప్రత్యేక టైమ్‌టేబుల్ రూపొందించాలని తెలిపారు. ఏఎల్‌ఎల్, ఏఎంఎల్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 58 పాఠశాలల్లో కార్యక్రమం అమలవుతోందన్నారు.