హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి'

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిర్దేశించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి నందన్ శుక్రవారం సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఆదేశాలను పాటించాలన్నారు. విభాగాల వారీగా తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు.