VZM: కొత్తవలస పీహెచ్‌సీ పరిధిలోని స్థానిక జడ్పీ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. డాక్టర్ శీతల్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో దాదాపు 91 శాతం మంది విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నులిపురుగుల నివారణ కార్యక్రమం


