హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆధునిక సౌకర్యాలతో నూతన గ్రంథాలయం'

NZB: నగరంలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన పుస్తకాలు, డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.