హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల చరిత్రలో సరికొత్త రికార్డు

ఆసియా క్రీడలలో భారతీయ పోల్ వాల్టర్ బరానికా ఎలాంగోవన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్‌లో 4.15 మీటర్లు దూకి ఆమె కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల చరిత్రలోనే పోల్ వాల్ట్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా.. తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల బరానికా చరిత్ర లిఖించింది.