హైదరాబాద్: 28°C
క్రీడలు

భారీ స్కోర్ సాధించిన ఆస్ట్రేలియా-A

మొహాలీ వేదికగా భారత్-A, ఆస్ట్రేలియా-A మహిళా జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 360 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చార్లీ నాట్ 70 బంతుల్లో 109 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. ఈ సిరీస్‌లో రెండు జట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి.