భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్ బుమ్రా అని కోచ్ గంభీర్ తెలిపాడు. అతడిని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నాడు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు బుమ్రా పనిభారాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపాడు. ప్రపంచకప్ నాటికి బుమ్రా ఫిట్‌గా ఉండటం జట్టుకు చాలా ముఖ్యమన్నాడు. కాగా, ఆసియా గేమ్స్‌లో బుమ్రా బరిలోకి దిగుతున్నాడు.
క్రీడలు
బుమ్రా ఫిట్‌నెస్ అత్యంత కీలకం: గంభీర్


